హైదరాబాద్: 28°C
క్రీడలు

నేటి నుంచి ఆర్కిటిక్ ఓపెన్

ఆర్కిటిక్ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆసియా గేమ్స్‌‌లో అంచనాలు అందుకోలేకపోయిన భారత షట్లర్లు ఈ టోర్నీలో సత్తా చాటాలని భావిస్తున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, తన్వి శర్మ, అస్మిత చాలిహా, ఉన్నతి హుడా పోటీలో ఉన్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్. ప్రణయ్‌ బరిలో నిలిచారు.