GDWL: ధరూర్ మండలంలోని పలు విద్యాసంస్థలను జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి మంగళవారం సందర్శించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, నాణ్యమైన భోజనం, పారదర్శకతపై దృష్టి సారించాలని సూచించారు. ప్రీ-ప్రైమరీలో ఆటల ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు.
తెలంగాణ
విద్యాసంస్థల్లో DEO తనిఖీలు


