హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం

WNP: సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తిరుమలరావు ఇవాళ సూచించారు. ఆర్టీఐ చట్టం 2005 వారోత్సవాల్లో భాగంగా కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో చట్టం కీలకమని తెలిపారు. విద్యార్థులు ఆర్టీఐ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.