హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మరాజాలయంలో ఘనంగా వరుణ యాగం

నెల్లూరులోని ధర్మరాజాలయంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు బాగా ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, ఆయన కుమార్తె షరిణి పాల్గొని ప్రత్యేక పూజలను చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ వరుణయాగం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు అధికారులు, కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.