హైదరాబాద్: 28°C
తెలంగాణ

గట్టుకాడిపల్లిలో పల్లె ప్రకృతి వనం అధ్వానం

WNP: గట్టుకాడిపల్లిలోని పల్లె ప్రకృతి వనం నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురవుతోంది. నీటి సౌకర్యం లేక పలు మొక్కలు ఎండిపోగా,పరిసరాల్లో పిచ్చిమొక్కలు విస్తరించాయి. పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం కోసం ఏర్పాటు చేసిన వనం ప్రస్తుతం కళావిహీనంగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు స్పందించి మొక్కలకు నీరందించి, పరిసరాలను శుభ్రపరచి సంరక్షణ చర్యలు చేపట్టాలి.