హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరువు మండలంగా ప్రకటించాలని ధర్నా

NRPT: రైతాంగ, ప్రజా సమస్యలు పరిష్కరించి ఉట్కూరును కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్‌ డిమాండ్‌ చేసింది. మండల కార్యదర్శి సిద్దు ఆధ్వర్యంలో MRO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎంఆర్వో అశోక్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం, పెన్షన్ల పెంపు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.