హైదరాబాద్: 28°C
తెలంగాణ

JNTUH క్యాంటీన్ సమస్యలపై వినతి

MDCL: JNTUHలోని ఓపెన్ క్యాంటీన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు మంగళవారం చీఫ్ ఇంజినీర్‌కు వినతిపత్రం అందజేశారు. క్యాంటీన్‌లో కూర్చునే బల్లలు సరిగా లేకపోవడం, డ్రైనేజీ నుంచి దుర్వాసన రావడం, ఫ్లోరింగ్ లేకపోవడం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.