PLD: వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. నవంబర్ 17న సదస్సు జరుగుతుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. రూ.3,227 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 34,196 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. స్థానికులు తమ సలహాలు, అభ్యంతరాలను నిరభ్యంతరంగా అధికారులకు తెలపవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నవంబర్ 17న వరికపూడిశెల ప్రజాభిప్రాయ సేకరణ


