హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

MDCL: పోచారం పీఎస్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చౌదరిగూడకు చెందిన పులుకూరి సీమోన్ (30) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత నెల 30న భార్య, పిల్లలను బంధువుల వివాహానికి పంపిన అనంతరం డబ్బులు లేవంటూ భార్యకు ఫోన్‌లో చెప్పాడు. సోమవారం పనికి పిలిచేందుకు వచ్చిన బంధువులు గదిలో అతడిని మృతిగా గుర్తించారు.