హైదరాబాద్: 28°C
తెలంగాణ

MSF సదస్సుకు మందకృష్ణ మాదిగ రాక

HYD: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో MSF ఆధ్వర్యంలో జాతీయ ప్రతినిధుల సదస్సు జరగనుంది. సదస్సు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ట్స్ కాలేజీ ముందు ప్రారంభ సభకు వేదిక ఏర్పాటు చేశారు. ప్రాంగణం అంతా MSF జెండాలతో నిండిపోయింది. ఈ సదస్సుకు ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం.