హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనర్ విద్యార్థినిపై టీచర్ వేధింపుల ఆరోపణలు

అన్నమయ్య: వెలిగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై బయాలజీ టీచర్ వెంకటేశ్వర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై తల్లి ఫిర్యాదు చేయగా డిప్యూటీ డీఈఓ నాగయ్య విచారణ చేపట్టి టీచర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.