హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోనోకార్పస్‌ చెట్ల తొలగింపునకు ఆదేశాలు

SDPT: పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని కోనోకార్పస్‌ చెట్లను నాలుగు వారాల్లోగా వేర్లతో సహా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఉపయోగపడే చెట్లను నాటాలని అటవీ, మున్సిపల్‌ అధికారులను ఆదేశించింది. గతంలో అధికారులకు వినతులు ఇచ్చినా చర్యలు లేకపోవడంతో గాదగోని చక్రధర్‌గౌడ్‌ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.