హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీని తోటలకు ప్రత్యామ్నాయ నీటి వసతి: హరీష్ బాబు

సత్యసాయి: ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోతున్న చీని తోటలను మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంఛార్జ్ హరీష్ బాబు పరిశీలించారు. రైతులను ఆదుకునేందుకు ట్యాంకర్‌కు రూ. 800 చెల్లించేలా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. 50% సబ్సిడీతో ఫార్మ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బీమా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.