హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్లముందే కష్టపడి పండించిన పంటకు నిప్పు

NZB: వర్ని మండలం పైడిపల్లిలో కష్టపడి పండించిన ఐదు ఎకరాల వరి పంటను రైతు కంది రాములు తన చేతులతోనే తగలబెట్టాడు. నీరు లేక పంట ఎండిపోయిందని మరో రెండు తడులకు నీరు వస్తే పంట చేతికి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంటకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని లేకపోతే ఆత్మహత్య శరణ్యమని వాపోయారు.