హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెడ్ కానిస్టేబుల్‌కు కడసారి వీడ్కోలు

అన్నమయ్య: నందలూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 2003 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ మూర క్రిస్టఫర్ (HC-166) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి IPS సంతాపం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ తరఫున కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు. మంగళవారం రిమ్స్ పరిధిలోని శ్మశానవాటికలో క్రిస్టఫర్ అంత్యక్రియలు నిర్వహించారు.