KMM: వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం DMHO రామారావు తనిఖీ చేశారు. వివిధ రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి, అమలవుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
PHCలో DMHO ఆకస్మిక తనిఖీలు


