హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగులాంబ ఆలయాల్లో ఆర్. కృష్ణయ్య పూజలు

GDWL: అలంపూర్‌ పట్టణంలోని జోగులాంబ ఆలయాలను రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య మంగళవారం సందర్శించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తుంగభద్ర పుష్కర ఘాట్‌లో పితృదేవతలకు పిండ ప్రదాన పూజలు నిర్వహించారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు పూర్తిచేశారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.