హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పర్యటనలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్

ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు పుల్లూరు టోల్‌గేట్ వద్ద కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఇవాళ స్వాగతం పలికారు. పట్టాభిరామ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం జిల్లాలో స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు.