E.G: సీతానగరం ఆర్టీసీ బస్టాండ్ మార్గంలో ఆర్చ్ నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లోపలికి వెళ్లే వీలు లేక జీవీకే కళ్యాణ మండపం ఎదుట రోడ్డుపైనే నిలుపుతున్నారు. 50 రోజుల క్రితం పనులు మొదలైనా ఇంకా పూర్తి కాలేదు. గత నాలుగు రోజులుగా వర్షం కురుస్తుండటంతో నిలువ నీడ లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నత్త నడకన సాగుతున్న ఆర్చ్ నిర్మాణం పనులు


