హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆహార నాణ్యతపై నిఘా ఏదీ?

SDPT: ఉమ్మడి జిల్లాలో హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగిలిన వంటకాలను ఫ్రిజ్‌లో భద్రపరచి మరుసటి రోజు వేడి చేసి వడ్డిస్తున్నారని, వంట నూనెలను పదేపదే వినియోగిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడే తనిఖీలు జరుగుతున్నాయని, నమూనాల పరీక్ష నివేదికలకు నెలలు పడుతున్నాయని పలువురు అంటున్నారు.