హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షంతో దెబ్బతిన్న అరటి తోటలు

అన్నమయ్య: రైల్వేకోడూరు మండలం ఓబనపల్లిలో భారీ వర్షంతో దెబ్బతిన్న అరటి తోటలు, పంట పొలాలను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పరిశీలించారు. రైతులను అడిగి నష్టం వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టం వివరాలను అధికారుల ద్వారా సేకరించి, బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.