SRD: న్యాల్‌కల్ మండలం కల్‌బేమల్‌లో సోమవారం అర్ధరాత్రి దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. బసవరాజు, గురునాక్ ఇళ్లలో బీరువాల తాళాలు పగలగొట్టి రూ.1.5 లక్షల నగదు, అర తులం బంగారం అపహరించారు. మరో ఇంట్లో విలువైన వస్తువులు లభించకపోవడంతో పట్టాపాస్ పుస్తకాన్ని చింపేశారు. హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
న్యాల్‌కల్‌లో వరుస చోరీలు


