హైదరాబాద్: 28°C
తెలంగాణ

చర్చి భూముల కబ్జా యత్నాలపై ఆరోపణలు

MBNR: జడ్చర్లలోని 57 ఎకరాల ఎంబీ చర్చి భూములను కొందరు రియల్టర్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మేడే రాజీవ్‌సాగర్ ఆరోపించారు. భూభారతి రికార్డుల్లో భూములు చర్చి పేరుతోనే ఉన్నాయని తెలిపారు. మెడికల్‌ కాలేజీ పేరుతో చర్చి నిర్మాణాల కూల్చివేతను ఆయన వ్యతిరేకించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ రికార్డులతో పాటు పోలీసుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.