హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

14వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు

PPM: జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతూ పార్వతీపురంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 14వ రోజుకు చేరాయి. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మద్దతు తెలిపారు. అర్ధ శతాబ్దం దాటినా ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో రైతులు వర్షాధారంపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు.