MDK: అల్లాదుర్గం మండలం చిల్వర్ సమీపంలోని NH 161పై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోడ్మట్‌పల్లికి చెందిన కొడపాక నాగరాజు (35) కాలినడకన ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
చిల్వర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం


