హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 11న ‘గోర్ మేళో మత్రో’ సభ

RR: అక్టోబర్ 11న షాద్‌నగర్ పట్టణంలోని తిరుమల బ్యాంక్వెట్ హాల్‌లో ‘గోర్ మేళో మత్రో’ సభ నిర్వహించనున్నారు. వెలిజర్ల తండా సేవాలాల్ గుడి పూజారి తావుర్య స్వామి చేతుల మీదుగా సభ కరపత్రాలను ఆవిష్కరించారు. బంజారా సమాజం ఐక్యతగా ఉండి హక్కుల సాధన కోసం గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.