హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలంపూర్‌లో పెన్షన్‌ వెరిఫికేషన్‌

GDWL: అలంపూర్‌ 8వ వార్డులో పెన్షన్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ మనోజ్‌కుమార్‌రెడ్డి పాల్గొని పెన్షన్‌దారుల పత్రాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.