హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మీ మార్ట్' కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: సీతానగరం మండలం ఇనుగంటి వారిపేటలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'మీ మార్ట్' జాతీయ ఉత్పత్తి పంపిణీ కేంద్రాన్ని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ మంగళవారం ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలపై నిత్యావసరాల ఆర్థిక భారం తగ్గించేందుకే ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.