హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సకాలంలో సిలబస్ పూర్తి చేయాలి'

PDPL: పదో తరగతి విద్యార్థుల సిలబస్ సకాలంలో పూర్తిచేసి, రివిజన్ చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఆయన ఇవాళ పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ జెడ్పి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థుల హాజరుకు ప్రాధాన్యం ఇవ్వాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని సూచించారు.