హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈరోజు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ కలెక్టర్ వెంట ఉన్నారు.