నంద్యాల పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో ఉన్న బృందావన గోశాలకు నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్యాన్లు, లైట్లు అందజేశారు. గోవుల సంరక్షణ కోసం బసవరాజు చేస్తున్న సేవలు అభినందనీయమని క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సందీప్, చంద్రశేఖర్ అన్నారు. గోశాలకు తమవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గోశాలకు ఫ్యాన్లు, లైట్లు అందజేత


