హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 222 ఇళ్ల పట్టాల పంపిణీ

నంద్యాల మార్కెట్ యార్డులో అర్బన్, రూరల్ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఎన్ఎండీ ఫరూక్ 222 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, సబ్ కలెక్టర్ మనీషా, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.