హైదరాబాద్: 28°C
తెలంగాణ

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అలైన్‌మెంట్‌పై అభ్యంతరం

NRPT: కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌పై మద్దూరు మండలం దామగన్‌పూర్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలకు నష్టం కలగకుండా వ్యవసాయ భూముల మీదుగా అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఇళ్లను కూల్చవద్దని స్పష్టం చేశారు. మంగళవారం MRO కార్యాలయంలో ఆర్‌ఐ ఆనంద్‌రావుకు వినతిపత్రం అందజేశారు.