హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ఓపెన్‌ స్కూల్‌పై అవగాహన

NRPT: ఓపెన్ స్కూల్‌ ద్వారా మహిళలందరూ విద్యను అభ్యసించవచ్చని రాష్ట్ర కోఆర్డినేటర్ క్రాంతిరెడ్డి, ఎడ్యుకేటెడ్ ప్రతినిధి ప్రణవ తెలిపారు. మంగళవారం మహిళా సమైక్య ఆధ్వర్యంలో కళాజాత బృందం ఓపెన్ స్కూల్‌పై మహిళలకు అవగాహన కల్పించింది. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఓపెన్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసిందని వారు తెలిపారు.