హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: APMCJAC

KDP: కడప రిమ్స్‌ ఆసుపత్రిలో వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అర్హులైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని APMCJAC డిమాండ్‌ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 14,600 మంది పని చేస్తున్నారని తెలిపింది. వేతన కోతను సమీక్షించి పూర్తి జీతాలు ఇవ్వాలని, పారామెడికల్‌ పోస్టులకు రెగ్యులర్‌ నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని కోరింది.