హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాడి పశువులకు చికిత్స శిబిరం

NGKL: వంగూర్‌ మండలం సర్వారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం పాడి పశువుల గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. మండల పశువైద్యాధికారి డాక్టర్‌ ఎలికంటి మల్లేష్‌ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. సర్పంచ్‌ సంపత్‌రావు సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.