WNP: డెంగీపై ప్రజలకు అవగాహన అవసరమని డీఎంహెచ్ భాస్కర్ నాయక్ అన్నారు. వనపర్తి 31వ వార్డులో డెంగీ కేసు నమోదైన నేపథ్యంలో కౌన్సిలర్ బండారు విజయలక్ష్మి రాధాకృష్ణతో కలిసి పర్యటించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు.
తెలంగాణ
డెంగీపై అవగాహన అవసరం: డీఎంహెచ్ వో


