NDL: బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఉన్న శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రంలో మంగళవారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు అధికారులు కలిసి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. రైతులు ప్రజల కోసం వర్షం రావాలని కోరుతూ ఆయన ఆలయంలో వరుణ యాగం పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షం కోసం ఎమ్మెల్యే పూజలు


