హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా బద్దం రాజేందర్ రెడ్డి

JGL: మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బద్దం రాజేందర్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆయనను మండల అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.