హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ లబ్ధిదారులకు మరో అవకాశం

ప్రకాశం: రేషన్ కార్డులకు మొబైల్ నంబర్ లింక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జిల్లాలో 6,16,806 మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు సుమారు 4 లక్షల మంది మాత్రమే మొబైల్ నంబర్ లింక్ చేసుకున్నారు. ఇంకా దాదాపు 2 లక్షల మంది వరకు లింక్ చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 15లోపు లబ్ధిదారులు మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.