వికారాబాద్ ఇంద్రానగర్ కాలనీలో మంగళవారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆధ్వర్యంలో సుమారు 85 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోను అదుపులోకి తీసుకున్నారు. 35 క్వార్టర్ మద్యం, 9 బీర్ సీసాలతో పాటు గుట్కా, కల్తీ ఆయిల్, కల్తీ పాపడ్లు, చకోడీలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
వాహన తనిఖీల్లో 50 బైక్‌లు, ఆటో స్వాధీనం


