BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంటి యజమానురాలు అన్నం దాసు లక్ష్మి ఉదయం దీపం వెలిగించి తాళం వేసి బయటకు వెళ్లిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. బట్టలు, గృహోపకరణాలు, బీరువా, రూ.5 వేల నగదు, పట్టా పాస్‌బుక్, ప్లాట్ పత్రాలు కాలిపోయాయి. సుమారు రూ.లక్ష నష్టం జరిగినట్లు బాధితురాలు తెలిపింది.
తెలంగాణ
కొండగడపలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం.. రూ.లక్ష ఆస్తి నష్టం


