మార్కాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక వరుణ జపాలు, హోమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా యాగం చేపట్టి సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
చెన్నకేశవస్వామి ఆలయంలో వరుణ యాగం


