HNK: రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నగర పాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హన్మకొండ నగరంలోని పద్మాక్షి ఆలయ గుండం వద్ద మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడి, అక్కడే నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మున్సిపల్ సిబ్బంది గుండంలోని గుర్రపు డెక్కను యంత్రాల సాయంతో తొలగించి శుభ్రం చేశారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకలకు సన్నద్ధమైన పద్మాక్షి గుండం


