హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

SRCL: సిరిసిల్ల పట్టణం సంజీవయ్యనగర్‌లో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పూర్ణిమ ఆధ్వర్యంలో ‘అంగన్ మిలన్ సేవ’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి హాజరై అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను సన్మానించారు. చిన్నారుల సంరక్షణ, పోషణలో వారి సేవలను అభినందించారు. అనంతరం చిన్నారులకు బిస్కెట్లు పంచిపెట్టారు.