హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ బల్బులు మారుస్తుండగా ప్రమాదం

KNR: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామంలో మంగళవారం విద్యుత్ బల్బులు మారుస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కత్తెరమల్ల రమేశ్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రి లేదా నిమ్స్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.