హైదరాబాద్: 28°C
తెలంగాణ

12న బతుకమ్మ ఉత్సవాలు

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా జాగృతి అధ్యక్షుడు గుమ్మడి రవీందర్ మంగళవారం తెలిపారు. బొడ్రాయి వద్ద జరిగే వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఉత్తమంగా బతుకమ్మలు పేర్చిన ఐదుగురు మహిళలకు ప్రత్యేక బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఆనందంగా వేడుకులు జరుపుకోవాలని సూచించారు.