హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ భారతి రీ సర్వేపై అవగాహన

PDPL: ఓదెల మండలం ఇందుర్తిలో భూభారతి రీ సర్వేపై కలెక్టర్ శ్రీహర్ష మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. భూ సమస్యల పరిష్కారం, ఖచ్చితమైన హద్దుల నిర్ధారణ కొరకు ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులు సహకరించాలని ఆయన కోరారు. తహాసిల్దారు వనజా, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.