హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వేధింపులను మౌనంగా భరించొద్దు'

SRCL: మహిళలు, బాలికలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే మౌనంగా ఉండకుండా వెంటనే షీ టీమ్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. గడిచిన రెండు నెలల్లో ఫిర్యాదుల ఆధారంగా ఆకతాయిలపై 4 ఎఫ్‌ఐఆర్‌లు, 5 పెట్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. హాట్‌స్పాట్‌ల వద్ద షీ టీమ్ బృందాలు మఫ్టీలో నిఘా కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. 8712656425కు సంప్రదించాలన్నారు.