హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ వివాదాలకు రీసర్వే పరిష్కారం: కలెక్టర్

WNP: పెబ్బేరు మండలం బూడిదపాడులో రీసర్వే 100% పూర్తయిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. రీసర్వేతో భూముల హద్దులు, విస్తీర్ణం కచ్చితంగా నమోదై భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు.రీసర్వే వివరాలను గ్రామ పంచాయతీలో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు.